ఉగాదికి విడుదల కానున్న వకీల్ సాబ్

ఉగాదికి విడుదల కానున్న వకీల్ సాబ్హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ ‘పింక్’ కు రీమేక్ గా ఇది రానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఉగాదికి విడుదల చేయాలని భావించి, చివరికి వాయిదా వేశారు. ఇప్పటికే విడుదలైన ‘మగువా’ సాంగ్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది.