రైతు అంశాలే ఎజెండాగా రాహుల్ డిక్లరేషన్ ! : ఉత్తమ్

రైతు అంశాలే ఎజెండాగా రాహుల్ డిక్లరేషన్ ! : ఉత్తమ్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : 2023 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తమ టార్గెట్ అని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ టూర్ నేపథ్యంలో టీ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఈనెల 6న హనుమకొండలో నిర్వహించే రైతు సంఘర్షణ సమితి సమావేశాన్ని తాము ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ ను కాంగ్రెస్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు పర్యటించి, పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ ను పరిశీలించారు. సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు.రైతు అంశాలే ఎజెండాగా రాహుల్ డిక్లరేషన్ ! : ఉత్తమ్అనంతరం మీడియాతో మాట్లాడారు. మే 6న జరుగబోయే సభలో రైతు అంశాలే ఎజెండాగా తీసుకుని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే అంశాలను డిక్లరేషన్ ద్వారా వెల్లడించనున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులకు మద్దతు ధర, పంట పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోళ్లు, రైతులు ఏ పంటలు వేసినా వాటికి అనుకూలంగా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో పండించే పంటల ఆధారాంగా కొనుగోళ్ల ఏర్పాట్లు చేయడం వంటి అంశాలను ఈ డిక్లరేషన్ లో స్పష్టంగా వెల్లడించబోతున్నట్లు ఉత్తమ్ కుమార్ తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ టీంను వరంగల్ డిక్లరేషన్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు.రైతు అంశాలే ఎజెండాగా రాహుల్ డిక్లరేషన్ ! : ఉత్తమ్అలాగే అసైన్డ్ భూముల వ్యవహారాన్ని కూడా ఈ డిక్లరేషన్ లో చేర్చనున్నారు. కాంగ్రెస్ పేదలకు వేలాది ఎకరాల అసైన్డ్ భూములు పంచింతే, టీఆర్ఎస్ వాటిని లాక్కొంటోందని , కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద రైతులకు ఏం చేస్తారో వివరించనున్నారని చెప్పారు. అంతేకాకుండా కౌలు రైతులకు పెట్టుబడి సాయం వంటి అంశాలపై ఈ డిక్లరేషన్ లో వెల్లడించనున్నారని తెలిపారు. వరంగల్ సభలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో చనిపోయిన రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇక తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను, సోనియా, రాహుల్ గాంధీలను గుండెల్లో పెట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, పొన్నాల, గీతారెడ్డి, జీవన్ కుమార్ , భట్టి విక్రమార్క తదితరులు అన్నారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనను, ఉస్మానియా యూనివర్సిటీ లో రాహుల్ పర్యటనను టీఆర్ఎస్ సర్కార్ అడ్డుకునే ప్రయత్నం సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ పాలనలో రైతులు, విద్యార్థులకు జరుగుతున్న నష్టాలను, రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసపుచ్చుతున్న తీరును బయటపెట్టే రోజులు దగ్గర పడ్డాయని వారు హెచ్చరించారు. టీఆర్ఎస్ చేస్తున్న మోసాలను ప్రజల మధ్యకు తీసుకువస్తామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధాకారంలోకి వస్తే పేద ప్రజలకు, రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇక మే6న జరుగబోయే రైతు సంఘర్షణ సమితి సభకు రైతులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.