చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయంఅబుదాబి : చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. శనివారం అబుదాబిలో జరిగిన మ్యచ్ లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నది. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మన్లలో యశస్వీ జైశ్వాల్, శివమ్ దూబే రాణించారు. యశస్వి జైశ్వాస్ 50 పరుగులు చేయగా, శివమ్ దూబే 64 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. ఇందులో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేశాడు.

మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంసెట్ ధోనీ మాట్లాడారు. టాస్ కోల్పోవడం బాడ్ లక్ అని అభిప్రాయపడ్డారు. 190 పరుగులు మంచి స్కోరని పేర్కొన్నాడు. అయితే తమపై బౌలర్లు వత్తిడి పెంచారని, తాము ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తొలి 6 ఓవర్లలోనే మ్యాచ్ ను తమవైపు తిప్పుకున్నారని వ్యాఖ్యానించాడు.