ఢిల్లీ చేతిలో ముంబై పరాజయం

ఢిల్లీ చేతిలో ముంబై పరాజయంషార్జా : డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తిరిగి ఓటమి బాటపట్టింది. హ్యాట్రిక్ పరాజయాల అనంతరం గత మ్యాచ్ లో పంజాబ్ పై గెలుపొందిన రోహిత్ సేన కీలక పోరులో ఢిల్లీ క్యాటిపల్స్ చేతిలో ఓడింది. శనివారం జరిగిన స్కోరింగ్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ( 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా, డికాక్ (19), సౌరభ్ తివారి ( 15), హార్దిక్ ( 17), కృనాల్ (13నాటౌట్ ) మంది ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.

ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో ఢిల్లీ కూడా తడబడ్డా ఆఖరి ఓవర్ లో విజయం సాధించింది. 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ( 33 నాటౌట్ ) చివరి వరకు అజేయంగా నిలువగా, పంత్ ( 26), అశ్విన్ ( 20 నాటౌట్ ) విలువైన పరుగులు జోడించారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, జయంత్, కృనాల్, బుమ్రా, కౌల్టర్ నైల్ తలా ఒక వికెట్ తీశారు. అక్షర్ పటేల్ కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.