రూ.50కే చీప్ లిక్కర్ బీజేపీ జాతీయ విధానమా? : కేటీఆర్

రూ.50కే చీప్ లిక్కర్ బీజేపీ జాతీయ విధానమా? : కేటీఆర్హైదరాబాద్ : ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రూ.50కే చీప్ లిక్కర్ అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు మరింత దిగజారిపోయారని, వావ్..వాట్ ఏ స్కీం వాట్ ఏ షేమ్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రూ. 50కే చీప్ లిక్కర్ బీజేపీ జాతీయ విధానమా? అని ప్రశ్నించారు. అధికారంలోని లేని రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారా ? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.