ఎస్ఎస్ఎల్‌వీ -డీ2 ప్రయోగం సక్సెస్

ఎస్ఎస్ఎల్‌వీ -డీ2 ప్రయోగం సక్సెస్

వరంగల్ టైమ్స్, సూళ్లూరుపేట : ఆంధ్రప్రదేశ్ సూళ్లూరుపేటలోని ఇస్రో సరికొత్త అధ్యాయం..ఎస్ఎస్ఎల్‌వీ -డీ 2 ప్రయోగం విజయవంతం. సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది ఇస్రో ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాల పంపినా ఘనత సొంతం చేసుకుంది.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 రాకెట్‌.. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువు గల భూ పరిశీలన ఉపగ్రహం EOS-07, దేశీయ బాలికల ద్వారా స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ రూపొందించిన 8.7కిలోల బరువు గల ఆజాదీశాట్‌-02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్‌ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్‌-01 ఉపగ్రహాన్ని రోదసీ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇస్రో..ఇప్పటికే ఎన్నో ప్రయోగాలతో అంతరిక్షంతో సత్తా చాటిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇవాళ చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2 ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసింది.