అండర్19 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లోకి భారత్

అండర్19 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లోకి భారత్స్పోర్ట్స్ డెస్క్ : టీంఇండియా అండర్ -19 వరల్డ్ కప్ లో అద్వితీయమైన విజయంతో క్వార్టర్ ఫైనల్ లో అడుగుపెట్టింది. కరోనా వైరస్ కారణంగా ఆరుగురు ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా బుధవారం రాత్రి జరిగిన పోరులో యంగ్ ఇండియా 174 పరుగుల తేడాతో ఐర్లాండ్ ను చిత్తు చేసింది. మొదట టీంఇండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.

హర్నూర్ సింగ్ ( 88 ;12 ఫోర్లు), రఘువంశీ ( 79 ; 10 ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలు సాధించగా, రాజ్ బవా ( 42), కెప్టెన్ నిషాంత్ సింధు ( 36), రాజ్ వర్ధన్ (39) రాణించారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 39 ఓవర్లలో 133 రన్స్ కి ఆలౌంటైంది. భారత బౌలర్లలో వికీ, కౌషల్, గర్వ్ సాంగ్వాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన యంగ్ ఇండియా, వరుసగా రెండో విజయంతో నాకౌట్ కు అర్హత సాధించింది.