అక్కడ 4 వేలు దాటిన కరోనా కేసులు

అక్కడ 4 వేలు దాటిన కరోనా కేసులుహైదరాబాద్ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 4,207 కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెల్పింది. మహమ్మారి బారిన పడి 1,825 మంది బాధితులు కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,663 యాక్టివ్ కేసులున్నాయి. నేడు ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా 1,20,215 మందికి పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.కొత్త కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 7,22,403 కి పెరిగింది.

ఇందులో ఇప్పటివరకు 6,91,703 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా 4,067 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం రికవరీ రేటు 95.75 శాతంగా ఉందని, మరణాల రేటు 0.56 శాతంగా ఉందని పేర్కొంది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,645 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 380, రంగారెడ్డిలో 366, హనుమకొండలో 154, సంగారెడ్డిలో 107 కేసులు రికార్డయ్యాయి.