సివిల్స్ లో ర్యాంక్ సాధించిన కానిస్టేబుల్ కుమారుడు

సివిల్స్ లో ర్యాంక్ సాధించిన కానిస్టేబుల్ కుమారుడుహైదరాబాద్‌:సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ నందు విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ కానిస్టేబుల్ కొడుకు డి.వినయ్ కాంత్ గత సంవత్సరం క్రితం రాజ్యసభ సెక్రెటరీ సెక్రటేరియట్ లో (AEO) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ, సివిల్స్ ప్రిపేర్ అయాడు. ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ (యూపీఎస్సీ) విడుదల చేసిన ఫలితాల్లో 516 ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కానిస్టేబుల్ ను అభినందించారు. పిల్లలు ఏ రంగంలో ప్రావీణ్యత ఉంటుందో ఆ రంగంలో ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కమిషనర్ సూచించారు.