గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 25,050 మంది అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత సాధించినట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ గత యేడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. మొత్తం 503 పోస్టులకు గాను 3,80,081 అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా, 2,85,916 మంది అభ్యర్ధులు ప్రిలిమ్స్ కు హాజరయ్యారు. 503 పోస్టులకు గాను మొత్తం 25,050 మందిని ఎంపిక చేసినట్లు కమిషన్ వెల్లడించింది.
ఓఎంఆర్ షీట్లలో హాల్ టికెట్ నంబర్ ను, టెస్ట్ బుక్ లెట్ నంబర్ ను సరిగా బబ్లింగ్ చేయని, డబుల్ బబ్లింగ్ చేసిన వారి పత్రాలను పరిగణనలోకి తీసుకోలేదని కమిషన్ వెల్లడించింది. ఒక్క పోస్టుకు రిజర్వేషన్ ఆధారంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేశారని తెల్పింది. టీఎస్పీఎస్సీ ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షను ఈ యేడాది జూన్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
పూర్తి సమాచారం కోసం..
పరీక్ష విధానానికి సంబంధించిన వివరాలను ఈ నెల 18 నుంచి కమిషన్ వెబ్ సైట్ http://www.tspsc.gov.in లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం టీఎస్పీఎస్సీ హెల్ప్ లైన్ 040-22445566, 040-23542187 నంబర్లలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని సూచించింది.