కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో పరీక్షలు: పాపిరెడ్డి

పాలమూరు: కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో పరీక్షల షెడ్యూల్‌ ఖరారు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిగ్రీ పరీక్షలకు సంబంధించి కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే రెండు వారాల్లో షెడ్యూల్‌ ఖరారు చేసి ఆగస్టు 20 తర్వాత పరీక్షలను నిర్వహిస్తామన్నారు. ముందుగా ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలను నిర్వహిస్తామని, మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి ఇప్పటికే పైతరగతికి ప్రమోట్‌ చేసినట్లు తెలిపారు. ఒక వేళ యూజీసీ ఆదేశిస్తే వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అకడమిక్‌ ఎంట్రెన్స్‌ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.