కొడుకు మృతి తట్టుకోలేక ఆగిన తల్లి గుండె

వరంగల్ జిల్లా : వరంగల్ నగరంలోని అండర్ బ్రిడ్జ్ పెరుకవాడలో భారతమ్మ అనే వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. భారతిమాయికి ఐదుగురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు. 8 నెలల కిందట ఇద్దరు కుమారులు కరోనాతో మృతి చెందారు. అప్పటి నుంచి మూడో కొడుకు కృష్ణ ఇంట్లోనే ఉంటుంది. గురువారం కృష్ణ అకస్మాత్తుగా మృతి చెందాడు. ఉన్న ఒక్క కొడుకు కూడా మృతి చెందడంతో అది చూసి తట్టుకోలేక వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. వరుస మరణాలతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.