ఎమ్మెల్యే రాజయ్యకు తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే రాజయ్యకు తప్పిన ప్రమాదంజనగామ జిల్లా: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే , తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి డా.టి. రాజయ్యకు తృటిలో ప్రమాదం తప్పింది. జనగామజిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హన్మకొండకు వస్తుండగా రఘునాథపల్లి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపల్లి సమీపంలో రోడ్డుపై ఇసుక లారీలు ఎదురుగా రావడంతో ఇసుక లారీలను తప్పించబోయి కాన్వాయ్ అదుపుతప్పింది. దీంతో కాన్వాయ్ లోని పోలీస్ వాహనం ఎమ్మెల్యే రాజయ్య వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజయ్య ప్రయాణిస్తున్న వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే రాజయ్యతో పాటు సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.