రానాకు విరాట పర్వం టీం శుభాకాంక్షలు

రానాకు విరాట పర్వం టీం శుభాకాంక్షలు
హైదరాబాద్​: హీరో రానా నేడు తన 36 వ జన్మదినం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కాగా రానా పుట్టిన రోజు సందర్భంగా విరాటపర్వం నుంచి రానా పోస్టర్​తోపాటు ఫస్ట్​ గ్లింప్స్​ వీడియోను విడుదల చేశారు మేకర్స్​. డైరెక్టర్​ వేణు ఊడుగుల , నిర్మాత సుధాకర్​ చెరుకూరి ఇతర సినిమా యూనిట్​ సభ్యులంతా రానాకు బొకేలు అందించారు. కేక్​ కట్​ చేయించి విషెస్​ చెప్పారు. ఈ సందర్భంగా రానా వారికి ధన్యవాదాలు తెలిపారు. 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రీకరిస్తున్న విరాటపర్వం సినిమాలో రానా కామ్రేడ్​ రవిశంకర్​ అలియాస్​ రవన్న గెటప్​లో సరికొత్తగా ప్రేక్షలముందుకు వస్తున్నాడు. ఎస్​.ఎల్.వి సినిమాస్​ పతాకంపై సుధాకర్​ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్​ బొబ్బలి మ్యూజిక్​ అందిస్తున్నారు. నివేదా పెతురాజ్​, ప్రియమణి, నందితాదాస్​, నవీన్​చంద్ర వహాబ్​, ఈశ్వరీరావ్​, సాయిచంద్, బెనర్జీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రానా ,సాయిపల్లవి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.