కొత్త రాజధానిగా విశాఖ!: సీఎం జగన్ 

కొత్త రాజధానిగా విశాఖ!: సీఎం జగన్

కొత్త రాజధానిగా విశాఖ!: సీఎం జగన్ 

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఏపీ కొత్త రాజధానిగా విశాఖపట్టణం ఉండబోతుందని ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ డిప్లమాటిక్ అలియన్స్ మీట్ లో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఏపీ రాజధానిగా అమరావతి ఉన్న విషయం తెలిసిందే. డిప్లమాటిక్ మీట్ కు హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు.

విశాఖపట్టణం మా రాష్ట్రానికి కొత్త రాజధాని కాబోతున్నదని, ఆ పట్టణానికి మీరంతా రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తాను కూడా విశాఖకు షిప్ట్ కాబోతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఏపీతో బిజినెస్ చేసేందుకు మీరంతా రాష్ట్రానికి రావాలని ఆయన ఆహ్వానం అందించారు.