శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి కాజల్
వరంగల్ టైమ్స్, తిరుమల: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు.ఈ రోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు.
అంతకుముందు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు.అనంతరం వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.