గ్రూప్ 4 దరఖాస్తుల గడువు పొడిగింపు
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్: గ్రూప్-4 దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ సోమవారం తెల్పింది. వాస్తవానికి నేటితో దరఖాస్తు గడువు ముగియనుండగా, ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 8,47,277 దరఖాస్తులు చేసుకున్నారని తెల్పింది. నేడు ఒకేరోజు 34,247 దరఖాస్తులు వచ్చాయని టీఎస్పీఎస్సీ వివరించింది.
గ్రూప్ -4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ 30 నుంచి జనవరి 30 వరకు దరఖాస్తులకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఐతే నోటిఫికేషన్ ద్వారా 8,180 పోస్టులను భర్తీ చేయనున్నది.