దర్శకుడిగా మారుతున్న యువ నిర్మాత

దర్శకుడిగా మారుతున్న యువ నిర్మాతహైదరాబాద్: విశ్వనాథ్‌ తన్నీరు నిర్మాతగా గతంలో పలు టీవీ సీరియల్స్‌ నిర్మించారు. గత సంవత్సరం విడుదలైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘యమ్‌ 6’ సినిమా నిర్మించి మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఈ యువ నిర్మాత విశ్వనాథ్‌ తన్నీరు పుట్టినరోజు డిసెంబర్‌ 6. ఈ సందర్భంగా తన తదుపరి సినిమా విశేషాలను తెలియజేస్తూ ”ఎన్నో సంవత్సరాలుగా సినీ, టీవీ రంగాలలో పనిచేసిన అనుభవం ఉంది. పలు ధారావాహికలను నిర్మించాను. గత సంవత్సరం విడుదలైన ‘యమ్‌ 6’ సినిమా ద్వారా నిర్మాతగా మారాను. ప్రేక్షకుల హ దయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఓ మంచి చిత్రానికి దర్శకత్వం వహించాలనేది నా ఆశయం. రచయిత, నా స్నేహితుడు వేమగిరి చెప్పిన లైన్‌ నాకు బాగా నచ్చింది. కథ, మాటలు బాగా కుదిరాయి. ఇప్పటికే సెట్స్‌కి వెళ్లాల్సిన మా సినిమా కరోనా మహమ్మారి వల్ల కొంచెం ఆలస్యం అయ్యింది. వైవిధ్యమైన కథాంశంతో మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. కథే హీరోగా రూపొందే ఈ సినిమాలో నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్లు ఉంటారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్తుంది” అన్నారు. ఈ సినిమాలో గిరి, రాగిణి, దిల్‌ రమేష్‌, నవీన్‌ కొమ్మ, శ్రవణ్‌, నామాల రవీంద్రసూరి, విజయభాస్కర్‌, వైభవ్‌, సురేష్‌ బొమ్మెర, గౌరెడ్డి మంజునాథ్‌ తదితరులు మిగతా ముఖ్యపాత్రలు పోషిస్తారు. ఈ చిత్రానికి కథ: వేమగిరి, కో డైరెక్టర్స్‌: రామచంద్ర, మహేష్‌ జాదవ్‌, శ్రవణ్‌కుమార్‌ వీర్లపాటి, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌: గుర్రపు విజయ్‌కుమార్‌, స్వామి, కెమెరా: మురళీకృష్ణ, రియాజ్‌, మ్యూజిక్‌: విజయ్‌ కూరాకుల, పాటలు: మౌనశ్రీ మల్లిక్‌, పాండు రంగయ్య, డబ్బింగ్‌ : ఆర్‌.సి.యమ్‌.రాజు, ఎడిటింగ్‌: సోమేశ్వర్ పోచం, పోస్ట్‌ ప్రొడక్షన్‌: టాకింగ్‌ పిక్టర్స్‌ స్టూడియో, సమర్పణ: యాక్టింగ్‌ స్టూడియో, స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వం, నిర్మాత : విశ్వనాథ్‌ తన్నీరు.