ఆ ఐదుగురికి అవకాశం !

ఆ ఐదుగురికి అవకాశం !మెల్​బోర్న్ ​: ప్రతిష్టాత్మక బోర్డర్​- గావస్కర్​ ట్రోఫీ మొదటి టెస్టులో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న భారత్​ రెండో టెస్టు చివరి జట్టు కూర్పుపై దృష్టిసారించింది. పేసర్​ మహ్మద్​ షమీ గాయంతో సిరీస్​కు దూరమవడం, కెప్టెన్​ విరాట్​ కోహ్లీ పెటర్నిటీ లీవ్​లో ఉండడంతో వీరిద్దరి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. రిషబ్​ పంత్​, కేఎల్​ రాహూల్​, మహ్మద్​ సిరాజ్​, శుభ్​మన్​గిల్​ బెర్త్​ను ఆశిస్తున్నారు. నాలుగో నంబర్​లో రాహూల్​ ఆడడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ‘ఓపెనర్​ పృథ్వీషా ప్లేస్​లో యువ బ్యాట్స్​మెన్​ శుభ్​మన్​ గిల్​ టెస్టు అరంగేట్రం చేస్తాడు. విరాట్ ప్లేస్​లో కేఎల్​ రాహూల్ జట్టులో ఆడనున్నాడు. హనుమ విహారీ స్థానంలో కంకషన్​ నుంచి కోలుకున్న ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా జట్టులోకి రానున్నాడు. వికెట్​ కీపర్​ బ్యాట్స్​మన్ వృద్ధిమాన్​ సాహా స్థానంలో రిషబ్​పంత్​, మహ్మద్​షమీ స్థానంలో మహ్మద్​ సిరాజ్​ లేదా నవదీప్​ సైనీకి జట్టులో చోటు లభించే అవకాశాలు ఉన్నట్లు’బీసీసీఐ వర్గాలు తెలిపాయి.​