పిడుగుపడి గొర్రెల కాపరి..30 గొర్రెలు మృతి

పిడుగుపడి గొర్రెల కాపరి..30 గొర్రెలు మృతి

వరంగల్ టైమ్స్, పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా నాగార్జునసాగర్ విజయపూరి సౌత్ చింతల తండలో పిడుగుపడి ఓ గొర్రెల కాపరి మృతి చెందాడు. విజయపూరి సౌత్ చింతల తండాకు చెందిన గొర్రెల కాపరి రోజూవారీగా గొర్రెలను మేపుతున్నాడు. అయితే మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్యలో ఉన్నట్టుండి ఉరుములతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో పాటు ఒక్కసారిగా పిడుగుపడటంతో గొర్రెల కాపరి రామవత్ సైదాతో పాటు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి.