స్థలం ఇచ్చి కేంద్రాన్ని నిలదీయండి: రావు పద్మ

స్థలం ఇచ్చి కేంద్రాన్ని నిలదీయండి: రావు పద్మహనుమకొండ జిల్లా : కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పీఓహెచ్ నిర్మాణంపై అధికార టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి డా. విజయరామారావు తీవ్రంగా ఖండించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, పీఓహెచ్ నిర్మాణంకై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అఖిల పక్షం నిరసనలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్రంను తప్పుబడుతూ నిరసనలు చేస్తున్న టీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలపై రావు పద్మ మండిపడ్డారు. కాజీపేట మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావు పద్మ, విజయరామారావు లు మాట్లాడారు. బీజేపీ పార్టీని ఎదుర్కోలేకనే ఇక్కడి నాయకులు రైల్వే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.

2017లో కాజీపేటకు రూ.379 కోట్ల పీఓహెచ్ ను మంజూరు చేసి, 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే భూ సేకరణ చేయక ప్రాజెక్ట్ గడువు ముగిసేలాగా ఇక్కడి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చేశారని రావు పద్మ అన్నారు. ఇక 150 ఎకరాల స్థలం ఇవ్వడానికి టీఆర్ఎస్ పార్టీకి 5 యేండ్లు సమయం పట్టిందని ఎద్దేవా చేశారు. ఇక కోచ్ ఫ్యాక్టరీకి 1500 ఎకరాల స్థలం అవసరం కనుక ముందు స్థలం కేటాయించి కేంద్రప్రభుత్వాన్ని సవాల్ చేయండని రావు పద్మ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పై ధ్వజమెత్తారు. కాజీపేట అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని నాయకులు ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ నాయకులు కందగట్ల సత్యనారాయణ, నవనగిరి నిర్మల, తోపుచెర్ల అర్చన, వలపదాసు రాం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.