ఓవర్సీస్ స్కాలర్షిప్స్ దరఖాస్తులు ప్రారంభం 

ఓవర్సీస్ స్కాలర్షిప్స్ దరఖాస్తులు ప్రారంభం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలకు చెందిన యూజీ, పీజీ విద్యార్థుల ఉన్నత చదువుల నిమిత్తం ఓవర్సీస్ స్కాలర్ షిప్ దరఖాస్తులకు ఆ శాఖ జిల్లా అధికారులు బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. లండన్, ఫ్రాన్స్, అమెరికా, కెనడా, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిల్యాండ్ తో పాటు సింగపూర్ వంటి దేశాలలో చదువుకోవడానికి అర్హతలున్న వారు ఓవర్సీస్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

ఆగస్టు 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో అడ్మిషన్లు పొందిన వారు ఈ మేరకు దరఖాస్తులు చేసుకునే విధంగా మైనారిటీ విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. జనవరి 3 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. జనవరి 23 వరకు దరఖాస్తుల గడువు కొనసాగుతుందన్నారు.

ఆన్లైన్ ద్వారా చేసుకున్న దరఖాస్తుల ఫాంలను ఫిబ్రవరి నెలాఖరులోగా సంబంధించిన అధికారికి పంపుకోవడానికి గడువు విధించినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం తెలంగాణ ఈ పాస్ అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు. www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.