సినీనటి కరాటే కల్యాణిపై కేసు నమోదు

సినీనటి కరాటే కల్యాణిపై కేసు నమోదు
హైదరాబాద్ : సినీనటి కరాటే కల్యాణిపై శనివారం జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. లైంగిక దాడి, హత్యకు గురైన బాధితురాలి వివరాలు సోషల్ మీడియాలో పెట్టారన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. జగద్గిరిగుట్టకు చెందిన నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కరాటే కల్యాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు.