పోలీస్ స్టేషన్ ఆవరణలో కాలి బూడిదైన వాహనాలు
వరంగల్ టైమ్స్, విశాఖపట్టణం జిల్లా : విశాఖ కంచెరపాలెం పోలీస్ స్టేషన్ ఆవరణలో వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఆకతాయిలు వాహనాలకు నిప్పు పెట్టారా? లేక సమీపంలోని ఇండస్ట్రీయల్ డంపింగ్ యార్డులో వ్యర్థాల నుంచి మంటలు వ్యాపించి అంటుకున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్టేషన్ ఆవరణలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో 26 బైక్లు, ఒక ఆటో, కారు దగ్ధమయ్యాయి.