నిరాశ్రయులకు దుప్పట్లు అందించిన చీఫ్ విప్

నిరాశ్రయులకు దుప్పట్లు అందించిన చీఫ్ విప్వరంగల్ టైమ్స్,హనుమకొండ జిల్లా: తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఉద్యమ నాయకులు, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ ను నిరాశ్రయులు నిండు మనస్సుతో ఆశీర్వదించారు. అర్థరాత్రి నగరంలో నిస్సహాయక స్థితిలో రోడ్డుకి ఇరువైపులా పడుకున్నా వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. హనుమకొండ నగరంలో రోడ్డుకి ఇరువైపులా చలికి వణుకుతూ నిస్సహాయత స్థితిలో పడుకున్న వారిని చూసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చలించిపోయారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అర్థరాత్రి పన్నెండు గంటలకు వాళ్ళ దగ్గరకి వెళ్లాడు. వాళ్ళ వివరాలు తెలుసుకొని వారికి దుప్పట్లు పంపిణీ చేశారు.

తదనంతరం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన కృషిని వారికి తెలిపారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల ప్రజల అభ్యున్నతికి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన మహనీయులు కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్ళ పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నాయకులు కేసీఆర్ ని అన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిరాశ్రయులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.