అమెరికాకు చైనా వార్నింగ్

అమెరికాకు చైనా వార్నింగ్బీజింగ్ : వచ్చే యేడాది చైనాలోని బీజింగ్ లో జరుగనున్న వింటర్ ఒలింపిక్స్ ను అమెరికా బాయ్ కాట్ చేసింది. దీనిపై డ్రాగన్ దేశం చైనా రియాక్ట్ అయ్యింది. అమెరికా చేపట్టిన దౌత్యపరమైన బహిష్కరణను చైనా ఖండించింది. దీనిపై ప్రతీకారం తీర్చుకోనున్నట్లు కూడా చైనా హెచ్చరించింది.

ఆ దేశవిదేశాంగ మంత్రి జావో లిజియాన్ ఈ అంశం గురించి నేడు మీడియాతో మాట్లాడారు. తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, కానీ వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించబోమని పేర్కొన్నారు.

చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న ఆరోపణలపై దౌత్య వేత్తలను ఆ దేశానికి పంపేందుకు అమెరికా నిరాకరించింది. కానీ తమ దేశ అథ్లెట్లు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు అమెరికా చెప్పింది.

అయితే క్రీడల్లో రాజకీయానికే అమెరికా తెరలేపుతోందని చైనా మంత్రి జావో ఆరోపించారు. అబద్ధాలు, అసత్యాల ఆధారంగా తమను అమెరికా బాయ్ కాట్ చేస్తోందని చైనా ఆరోపిస్తోంది. ఇటీవల రెండు అగ్రదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. చైనాలో ఉలిగర్ ముస్లింలపై ఊచకోతకు చైనా పాల్పడుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది.