సీజేఐ పర్యటన..హనుమకొండలో బందోబస్తు

సీజేఐ పర్యటన..హనుమకొండలో బందోబస్తుహనుమకొండ జిల్లా : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏన్వీ రమణ వరంగల్ పర్యటన సందర్బంగా ఎర్పాటు చేయాల్సిన బందోబస్తుపై వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి శనివారం కమిషనరేట్ కార్యాలయములో పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. సెంట్రల్ జోన్ ఇంచార్జ్ పుష్పారెడ్డి, లా అండ్ ఆర్థర్ మరియు ట్రాఫిక్ అదనపు డిసిపి సాయి చైతన్య, ఆర్మూడ్ రిజర్వ్ అదనపు డిసిపిలు భీంరావు, సంజీవ్ తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గోన్న ఈ సమావేశంలో సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పర్యటన బందోబస్తులో భాగంగా అధికారులకు అప్పగించిన విధుల నిర్వహణపై పోలీస్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు అందజేశారు.

దీంతో పాటు న్యాయమూర్తి రాత్రి బసచేసే నిట్ కళాశాల, భద్రకాళి ఆలయ సందర్శన, వరంగల్ కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కోర్టుల ప్రారంభోత్సవం సందర్బంగా అధికారులు నిర్వహించాల్సిన బందోబస్తు , కల్పించాల్సిన భద్రత ఏర్పాట్లు , రూట్ బందోబస్తు, సాయుధ పోలీసులు మోహరించాల్సిన ప్రాంతాలు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెంట తరలివస్తున్న హైకోర్టు న్యాయమూర్తులకు కల్పించాల్సిన భద్రత పై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించారు.