రామప్పను సందర్శించిన ఎన్వీ రమణ దంపతులు

రామప్పను సందర్శించిన ఎన్వీ రమణ దంపతులుములుగు జిల్లా : తెలంగాణలోని సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు శనివారం సాయంత్రం సందర్శించుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలోని శ్రీ రామలింగేశ్వర స్వామి రామప్ప ఆలయానికి చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు జిల్లా ఎస్పీ సంగ్రాం సింగ్ జి పాటిల్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, మహబూబాబాద్ ఎంపీ కవిత, ప్రణాళిక సంగం ఉపాధ్యక్షుడు వినోద్, ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఆలయ అర్చకులు, న్యాయవాదులు శాలువాతో సత్కరించి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.రామప్పను సందర్శించిన ఎన్వీ రమణ దంపతులురామప్ప ఆలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆలయ గైడ్ రామప్ప దేవాలయం ప్రత్యేకత, శిల్ప కళా సంపద విశిష్టత గురించి వారికి వివరించారు. కాకతీయ కళాఖండాలకు ప్రతీక అయిన రామప్ప శిల్పాలను చూసి చీఫ్ జస్టిస్ రమణ సంతోషం వ్యక్తం చేశారు.