కడప జిల్లాలో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన

కడప జిల్లాలో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటనఅమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న ముగించుకుని మంగ‌ళ‌వారం అమ‌రావ‌తి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బుధ, గురువారాల్లో వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బుధ‌వారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప బయలుదేరనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బస చేస్తారు.

గురువారం దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో సీఎం జగన్‌ భేటీ అవుతారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి 12.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.