టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా వైపు కాంగ్రెస్ అడుగులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా వైపు కాంగ్రెస్ అడుగులుహనుమకొండ జిల్లా : పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వలసల పరంపర కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. హనుమకొండలోని చల్లా ధర్మారెడ్డి నివాసంలో వారు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువా కప్పిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధి పనులు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని, కేసీఆర్ సుపరిపాలనకు ఆకర్షితులై టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు వారు తెలిపారు. ఇక పరకాల నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కృషి ఎనలేనిదని టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు చల్లాను కొనియాడారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు తమ పార్టీలోకి చేరడం సంతోషకరమని ఎమ్మెల్యే చల్లా అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, తమ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, అభివృద్ధి దిశగా, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని టీఆర్ఎస్ లోకి చేరిన కాంగ్రెస్ నాయకులకు చల్లా ధర్మారెడ్డి కోరారు. అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వారితో ముచ్చటించారు. వారి ప్రాంతంలో ఉన్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలో ఉన్న పలు సమస్యలను త్వరితగతిన పూర్తిచేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో ఎన్. చందర్, టి.రాజు, సీఎచ్ మల్లయ్య, డి.నాగరాజు, పి.దేవేందర్, ఏ.రాజు, తోట రాములు, టి.కోనూర్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్క సుమలత రజినికర్, జెడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజు, మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ లేతాకుల సంజీవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, మాజీ మార్కెట్ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, సర్పంచ్ గట్ల స్వాతి భగవాన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రేవురి సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బాషబోయిన సాగర్, పావని రవీందర్, ఎండి అంకూస్, వేముల నవీన్ తదితరులు పాల్గొన్నారు.