రేపు ఢిల్లీకి వెళ్లనున్న కాంగ్రెస్ నేతలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడంతో నేతలు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు సోనియాతో భేటీ కానున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్లు, ఇతర ముఖ్య నేతలకు సైతం హైకమాండ్ ఆహ్వానం అందింది. రాష్ట్రంలో పార్టీలో నెలకొన్న సంక్షోభంపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పీసీసీ అధ్యక్షుడిపై సీనియర్ నేతల అసంతృప్తి అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. తాజాగా 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం పాలైంది. ఈనేపథ్యంలో పార్టీకి పూర్వ వైభవం తేవడంపై దృష్టి సారించిన హైకమాండ్ అన్ని రాష్ట్రాల నేతలతో సమావేశమవుతున్నారు.