పూణేలో కొత్తగా 79 కరోనా కేసులు

పూణేలో కొత్తగా 79 కరోనా కేసులు

వరంగల్ టైమ్స్, పుణె : పుణెలో 79 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఐతే ఎటువంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. అసలు ఇప్పటి వరకు పుణెలో సుమారు 1.45 మిలియన్ల మందికి కరోనా సోకింది. అందులో దాదాపు 1.43 మిలియన్ల మంది కోలుకోగా, 20,509 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు కొత్త కరోనాకి సంబంధించి పుణె రూరల్ లో 54, పూణె నగరంలో 23, పింప్రి-చించ్వాడ్ లో 2 కేసులు నమోదయ్యాయి.పూణేలో కొత్తగా 79 కరోనా కేసులుదీంతో ఈ కొత్త కరోనాకి సంబంధించిన కేసుల సంఖ్య 425,256కి చేరుకుంది. అయితే పుణె రూరల్ లో మరణాల సంఖ్య 7,143, పుణె నగరంలో 9,427 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 17.46 మిలియన్ డోసుల వ్యాక్సిన్లు వేశారు. అందులో 9.52 మిలియన్లు మొదటి డోసులు, 7.68 మిలియన్లు రెండవ డోసులు, 2,48,055 మందికి ముందు జాగ్రత్తగా డోసులు వేశారు.