ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ రూపొందించాలి: సీఎం

ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ రూపొందించాలి: సీఎం

వరంగల్ టైమ్స్ , న్యూఢిల్లీ : రైతుల పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీని రూపొందించాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు. లేకుండూ ప్రధాని మోడీని తరిమికొడగామని హెచ్చరించారు. వచ్చే ప్రభుత్వంతో ఆ పాలసీని రూపొందిస్తామని స్పష్టం చేశారు. మోడీకి ధనం కావాలి లేదా ఓట్లు కావాలి. ధాన్యం వద్దు, ఇదే మీ ప్రభుత్వ కుట్ర అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. రైతులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు పోరాటం ఆగదని తేల్చిచెప్పారు.ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ రూపొందించాలి: సీఎంరైతుల సంక్షేమం కోసం జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ తో కలిసి పని చేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు తికాయత్ వెంట ఉంటారని తెలిపారు. రాకేశ్ తికాయత్ ను కేంద్రం ఎన్ని విధాలుగా అవమానించిందో మనమంతా చూశామని తెలిపారు. తికాయత్ ను దేశ ద్రోహి అన్నారు, ఉగ్రవాది అన్నారు, రైతుల కోసం అవమానాలు భరిస్తూనే ముందుకు సాగుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.