వుమెన్స్ డబుల్స్ ఫైనల్లో సానియా జోడి ఓటమి
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : అమెరికాలోని దక్షిణ కరోలినాలో జరిగిన చార్లెస్టన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ వుమెన్స్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా జోడి ఓటమిపాలైంది. చెక్ దేశ క్రీడాకారిణి లూసీ రాడెకాతో జతకట్టి డబుల్స్ ఆడిన సానియా , ఫైనల్లో 6-2, 4-6, 10-7 స్కోర్ తేడాతో 4వ సీడ్ జంట ఆండ్రెజా క్లెపాక్, మగ్దా లిన్నెట్ చేతిలో ఓటమి చెందింది. ఈ మ్యాచ్ లో 2 గంటల 35 నిమిషాల పాటు సాగింది. సెమీస్ లో టాప్ సీడ్స్ జాంగ్ షూయి జంటపై ఈజీ విక్టరీ కొట్టిన సానియా జోడి ఫైనల్లో తడబడింది. ఈ సంవత్సరం మేలో జరుగనున్న ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో సానియా ఆడనున్నది. 2022 సీజన్ ముగిసిన తర్వాత టెన్నిస్ నుంచి రిటైర్ కానున్నట్లు సానియా ప్రకటించిన విషయం తెలిసిందే.