కేర్ ఆస్పత్రిలో హీరో బాలకృష్ణ

కేర్ ఆస్పత్రిలో హీరో బాలకృష్ణహైదరాబాద్ : టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ కేర్ ఆస్పత్రిలో చేరారు. బాలకృష్ణకు కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో సోమవారం కేర్ ఆస్పత్రిలో చేరారు. కేర్ ఆస్పత్రి వైద్యుల బృందం బాలకృష్ణకు సుమారు 4 గంటల పాటు సర్జరీ చేసింది. అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు వెల్లడించారు. త్వరలోనే బాలకృష్ణ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని వైద్యులు పేర్కొన్నారు.

ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన అఖండ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. అయితే ఈ మూవీ విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. మరోవైపు ఆహా ఓటీటీ ప్లాట్ ఫాం షోతో బిజీగా ఉన్నాడు. నవంబర్ 4న తొలి ఎపిసోడ్ ప్రీమియర్ కానుంది.