రోజూ 2 ఖర్జూరాలు తింటే..వాటికి చెక్ పెట్టొచ్చు!

రోజూ 2 ఖర్జూరాలు తింటే..వాటికి చెక్ పెట్టొచ్చు!

రోజూ 2 ఖర్జూరాలు తింటే..వాటికి చెక్ పెట్టొచ్చు!

వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : స్వీట్లకు ప్రత్యామ్నాయంగా భావించే ఖర్జూరాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. వాస్తవానికి ఖర్జూరంలో మంచి మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. అంతేకాదు అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. అదనంగా, ఖర్జూరంలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి కంటి వ్యాధులు, మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి, గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. కానీ మీరు ప్రతీ రోజూ 2 ఖర్జూరాలను 1నెలపాటు నిరంతరంగా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నెల రోజుల పాటు ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

* మలబద్ధకం :
రోజుకు రెండు ఖర్జూరాలను ఒక నెలపాటు తిన్నట్లయితే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఖర్జూరంలో మంచి మొత్తంలో పీచు ఉంటుంది. ఇది ప్రేగు కదలికను వేగవంతం చేస్తుంది. కడుపులో జీవక్రియ రేటును పెంచుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

* పైల్స్ లో ఉపశమనం పొందుతారు :
మీరు పైల్స్ తో బాధపడుతున్నట్లయితే ఖర్జూరాలు చక్కటి పరిష్కారం. ఎందుకంటే ఖర్జూరాను తినడం వల్ల జీవక్రియ రేటు పెరగడంతో పాటు మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. వాస్తవానికి పైల్స్ ఉన్నవారు మలబద్ధకం, పొడి మలం కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఖర్జూరంలోని పీచు నీటిని పీల్చుకుని ప్రేగు కదలికను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఈ విధంగా పైల్స్ నుండి ఉపశమనం అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

* రక్తహీనత నివారణ :
ఐరన్ లోపం ఉన్న వారికి రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఖర్జూరాను డైట్స్ లో చేర్చుకున్నట్లయితే శరీరంలో ఐరన్ లోపాన్ని తొలగించడంతోపాటు రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో రాగి, సెలీనియం, మెగ్నీషియం వంటి అనేక రకాల మూలకాలు ఉన్నాయి. ఇవి రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి.

* లో బీపీ సమస్యకు చెక్ :
లో బీపీ సమస్య ఉన్నవారు ఖర్జూరం తీసుకోవడం చాలా రకాలుగా మేలు చేస్తుంది. వాస్తవానికి ఇందులోని కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్‌లు లో బీపీ ఉన్న వ్యక్తులలో శక్తి స్థాయిలను పెంచుతాయి. దానిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో గడ్డకట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

* ఖర్జూరను ఎలా తినాలి :
ఖర్జూరం తినడానికి సరైన మార్గం ఏమిటంటే మీరు పాలలో లేదా నీటిలో నానబెట్టి తినవచ్చు. మీరు నీటిని తీసుకుంటే ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి. మీరు పాలు తీసుకుంటే రాత్రి తీసుకోండి.

NOTE :
ఒక రోజులో 2 కంటే ఎక్కువ ఖర్జూరాలు తినకూడదని గుర్తుంచుకోండి.