వైద్యారోగ్యశాఖ పనితీరు వండర్ ఫుల్ : ఓవైసీ

వైద్యారోగ్యశాఖ పనితీరు వండర్ ఫుల్ : ఓవైసీ

వైద్యారోగ్యశాఖ పనితీరు వండర్ ఫుల్ : ఓవైసీ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఎంఐఎం పక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణ వైద్యారోగ్య శాఖపై ప్రశంసల వర్షం కురిపించారు. వైద్యారోగ్య శాఖ పద్దు సందర్భంగా శనివారం అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ తీసుకున్న గొప్ప నిర్ణయాలు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చేస్తున్న కృషిని కొనియాడారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలవడం తెలంగాణ వైద్యారోగ్య శాఖ పనితీరుకు నిదర్శనం అన్నారు. జీహెచ్ఎంసీ ఆరోగ్యాన్ని బస్తీ దవాఖానలు పరిరక్షిస్తున్నాయని, బస్తీ దవాఖానలు వండర్ఫుల్ గా వర్క్ చేస్తున్నాయన్నారు. పట్టణ పేదలకు ఎంతో మంచి సేవలు అందిస్తున్నాయని,సీఎం కేసీఆర్ గారు ప్రారంభించిన గొప్ప చొరవని, దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరారు.

‘2014 నుంచి ఇప్పటి వరకు పోల్చితే ఎంఎంఆర్ 92 నుంచి 43కి తగ్గింది. జాతీయ సగటు-97. ఐఎంఆర్ 39 నుంచి 24, దేశ సగటు 28. అండర్ 5 మోర్టాలిటీ- 41 నుంచి 23. దేశ సగటు 32. నియోనాటల్ మోర్టాలిటీ రేట్ 25 నుంచి 15 కు తగ్గిందిత. దేశంలో 20గా ఉంది. ఫుల్ ఇమ్యునైజేషన్ 68శాతం నుంచి 100 శాతానికి చేరింది. దేశంలో 79శాతం. ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు 91 నుంచి 97శాతం. దేశంలో 79శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య కుంటుంబ సంక్షేమ సర్వే ద్వారా వచ్చిన ఈ ఇండికేటర్స్ వృద్ధి చూస్తే, దేశ ఆరోగ్య రంగంతో పోల్చితే తెలంగాణ ఎన్నో రెట్లు బాగుంది’ అని అక్బరుద్దీన్ అన్నారు. సీఎం కేసీఆర్, ఎనర్జిటిక్ మంత్రి హరీశ్ రావు గారికి శుభాకాంక్షలు చెబుతున్నాను. ఫైనాన్స్ అండ్ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ, అద్బుతంగా పని చేస్తారని, వైద్యారోగ్య శాఖ మంచి పనితీరు కనబర్చడంలో హరీష్ రావు కృషి ఎంతో ఉందని అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.