డబుల్ సెంచరీ మార్క్ ను తాకిన ఇషాన్ కిషన్
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : చివరిదైన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఇక శిఖర్ ధావన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ మరోసారి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ, ఇషాన్ బౌండరీలతో బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ క్రమంలోనే ఇషాన్ వన్డేల్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. ఇషాన్ 204 పరుగులు తీసి ఔట్ అయ్యాడు. ఇలా భారత్ తరపున డబుల్ సెంచరీ బాదిన నాలుగో బ్యాటర్ ఇషాన్ కిషన్ కావడం విశేషం. కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించి, ఇప్పటి వరకు క్రిస్ గేల్ ( 138 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.ఆ తర్వాత కోహ్లీ సెంచరీ చేశాడు. ఇది కోహ్లీకి 72వ అంతర్జాతీయ సెంచరీ. కోహ్లీ అత్యధిక సెంచరీ జాబితాలో రికీ పాంటింగ్ ను దాటేశాడు. టీం ఇండియా జోరు చూస్తే 450 స్కోర్ చేస్తుందని అనిపించింది. కానీ 113 పరుగుల వద్ద కోహ్లీ వెనుదిరిగాడు. మరోసారి కేఎల్ రాహుల్ 8 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 3 స్కోర్ తో నిరాశ పరిచారు.
చివరిలో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 20 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 37 పరుగులు ధాటిగా ఆడటంతో టీం ఇండియా 400 పరుగులు చేసింది. ఐతే చివరి ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో బంగ్లాదేశ్ కు ఇండియా 410 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది.
బంగ్లా బౌలర్లలో ఎబాదత్ హుస్సేన్ , షకిబుల్ హసన్, తస్కిన్ అహ‌్మద్ తలా 2 వికెట్లు తీశారు. ముస్తాఫిజుర్ రెహమాన్, మెహదీ మిరాజ్ చెరో వికెట్ తీశారు. ఐతే 3 వన్డేల సిరీస్ లో మొదటి రెండు వన్డేల్లో గెలిచిన బంగ్లాదేశ్ ఇప్పటికే సిరీస్ గెలుచుకుంది.