ఖమ్మంలో ల్యాబ్ ను ప్రారంభించిన హరీష్ రావు

ఖమ్మంలో ల్యాబ్ ను ప్రారంభించిన హరీష్ రావుఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.20 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ ల్యాబ్ ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన ట్రామా కేర్ యూనిట్, ఎమర్జెన్సీ, ఉమెన్ మిల్క్ బ్యాంక్ లను కూడా వారు ప్రారంభించారు.

ఈకార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు రాములు నాయక్ , కందాల ఉపేందుర్ రెడ్డి , సండ్ర వెంకట వీరయ్య , జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, డీఎం&హెచ్ఓ మాలతి, అధికారులు పాల్గొన్నారు.