మద్రాస్ ఐఐటీలో లాక్​డౌన్​

మద్రాస్ ఐఐటీలో లాక్​డౌన్​మద్రాస్​: ప్రఖ్యాత విద్యాలయం ఐఐటీ -మద్రాస్ లోలాక్‌డౌన్‌ విధించారు. క్యాంపస్‌లో కరోనా కేసులు కలకలం పెరుగుతున్నాయి. ఒక్కసారిగా 71 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 66 మంది విద్యార్థులున్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం క్యాంపస్‌లో 774 మంది విద్యార్థులున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ-మద్రాస్ లో మళ్లీ లాక్‌డౌన్‌విధించారు. దీంతో అన్ని డిపార్టుమెంట్లను మూసివేస్తున్నట్లు విద్యాలయం అధికారులు ప్రకటించారు.