ఫ్రెండ్స్ కి గ్రీన్ చాలెంజ్ విసిరిన మాధవిలత

ఫ్రెండ్స్ కి గ్రీన్ చాలెంజ్ విసిరిన మాధవిలతహైదరాబాద్ :  రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జీ‎‌హెచ్ఎంసీ పార్క్ లో సినీ నటి మాధవిలత మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు తమ ఇంటి వద్ద మొక్కలు నాటాలని ఆమె కోరారు. మనతోపాటు భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు చాలా అవసరమని నటి మాధవి తెలిపింది. చెట్లను నరకకుండా వాటిని కాపాడాలని కోరారు. అంతే కాకుండా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అందరిని ఆమె కోరారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని మాధవిలత తన స్నేహితులకు చాలెంజ్ విసిరారు.