తనువు చాలిస్తూనే బిడ్డలకు జన్మనిచ్చిన జింక

తనువు చాలిస్తూనే బిడ్డలకు జన్మనిచ్చిన జింక

తనువు చాలిస్తూనే బిడ్డలకు జన్మనిచ్చిన జింకవరంగల్ టైమ్స్, తిరుపతి : తిరుమల ఘాట్ రోడ్ లో గర్భంతో ఉన్న ఓ జింక ను బస్సు ఢీకొన్నది. అయితే గర్భంతో ఉన్న ఆ తల్లి జింక తనువు చాలిస్తూ బిడ్డలకు జన్మనిచ్చింది. ఇదంతా గమనించిన భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన టీటీడీ అధికారులు అప్పుడే జన్మించిన జింక పిల్లలకు చేరదీశారు. ఈ సన్నివేశాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కంటతడి పెట్టారు.

ఈదృశ్యాన్ని చరవాణిలో వీక్షించిన ఎంపీ గురుమూర్తి చలించిపోయారు. ఘాట్ రోడ్డు లో వన్య ప్రాణుల సంరక్షణార్ధం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులను సూచిస్తామని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఇలాంటి యాక్సిడెంట్లు పునరావృతం కాకుండా తగు చర్యలు టీటీడీ తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.