భారీగా గంజాయి పట్టివేత..అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయితో పాటు నార్మోటిక్ డ్రగ్స్ తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 43.54 లక్షల విలువ చేసే 294 కిలోల గంజాయి, నగదును స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి ఎస్ఓటీ, రామన్నపేట పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.