రైతు బంధు వేడుకల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

రైతు బంధు వేడుకల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంహనుమకొండ జిల్లా : తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు సంబురాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదవ విడుత 64 లక్షల మంది రైతులకు 50వేల కోట్ల పెట్టుబడి సాయం అందించింది. దీంతో సంక్రాంతి వరకు రైతు బంధు సంబురాలను కొనసాగించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో రైతులు సంక్రాంతి ముందు నుంచే సంబురాల్లో మునిగి తేలుతున్నారు.

ఇందులో భాగంగానే హనుమకొండ జిల్లాలో రైతులు రైతుబంధు వేడుకలు నిర్వహించారు. దర్గా కాజీపేట గాంధీ నగర్ సొసైటీలో ఏర్పాటు చేసిన రైతు బంధు వారోత్సవాలలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేష్ లు పాల్గొన్నారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

వ్యవసాయంతో పాటు అన్ని రంగాలలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి ఉపాధి అవకాశాలు పెంచుతున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. రైతులకు చేయూతనిచ్చేందుకే రైతు బంధు అని అన్నారు. ఈ వేడుకలో ఎంపీ పసునూరి దయాకర్, రైతు బంధు కో ఆర్డినేటర్ లలిత యాదవ్, కార్పొరేటర్లు, రైతు బంధు సమితి సభ్యులు, రైతులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.