మహారాష్ట్రలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు

ముంబై : మహారాష్ట్రలో కరోనా విజృంభన కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజులోనే కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 40,925 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 20 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,41,492 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 876 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా అందులో 435 మంది రికవరీ అయ్యారు. ముంబైలో తాజాగా 20,971 కేసులు నమోదు అయ్యాయి. ముంబైలో ప్రస్తుతం 91731 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబైలో 8490 బాధితులు రికవరీ అవ్వగా, మరో ఆరుగురు మృతి చెందారు.