బీజేపీకి మంత్రి ఎర్రబెల్లి స్ట్రాంగ్ కౌంటర్

బీజేపీకి మంత్రి ఎర్రబెల్లి స్ట్రాంగ్ కౌంటర్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : దేశ ప్రజలు అభివృద్ధివైపు చూస్తున్నారని రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీజేపీ నేతల కళ్లకు పొరలొచ్చాయని, వారు కళ్లు ఉండి కబోదుళ్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు వారు మీడియా ముఖంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ ఆర్అండ్ బీ గెస్ట్ హౌజ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ లతో కలిసి మాట్లాడారు.బీజేపీకి మంత్రి ఎర్రబెల్లి స్ట్రాంగ్ కౌంటర్బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై విమర్శలు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై వారు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దుకోవడం చేతగాని వాడు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు జనం స్వచ్ఛంధంగా రావడాన్ని చూసి బీజేపీకి వణుకుపుట్టుందని అన్నారు. ఆవిర్భావ సభకు 5 లక్షల జనాన్ని అంచనా వేసుకుంటే, 6లక్షలకు పైగా జనాలు స్వచ్ఛంధంగా వచ్చి సభలో పాల్గొనడం అద్భుతమని మంత్రి దయాకర్ రావు అన్నారు. తన 40 యేళ్ల రాజకీయ జీవితంలోనే ఇలాంటి అద్భుతమైన సభను ఎన్నడూ చూడలేదని మంత్రి అన్నారు.

దమ్మూ, ధైర్యం ఉంటే విభజన చట్టంలోని హమీల గురించి పోరాడండి తప్ప, విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తే రానున్న రోజుల్లో బీజేపీని ప్రజలు భూస్థాపితం చేస్తారని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చూసి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కి మతిపోయిందని, వారు ఏం మాట్లాడుతున్నారో కూడా తెల్వడం లేదని మంత్రి దయాకర్ రావు అన్నారు. దేశమంతా తెలంగాణ స్కీంలు ప్రవేశపెడతామంటే మీకెందుకు భయమని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని ప్రశ్నించారు.

రాష్ట్రంలో మాకంటే ఎక్కువ ఏం పనిచేశావో చూపించాలని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. బండి సంజయ్ మూర్ఖుడు, నెత్తి మీద వెంట్రుకలు లేవనుకున్న, కానీ మెదడు కూడా లేదని ఇప్పుడే తెలిసిందని మంత్రి ఎద్దేవా చేశారు. పిచ్చిపిచ్చి మాటలు, ఔలా మాటలు మాట్లాడుతున్నావు, పిచ్చి కూతలు మానుకో బండి సంజయ్ అంటూ మంత్రి గరం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని కించపరుస్తూ ఆలయాల్లోకి రమ్మనడం కాదు.. నీకు దమ్ముంటే మా తెలంగాణ గ్రామాల్లో పర్యటిద్దాం రా అంటూ మంత్రి ఫైర్ అయ్యారు.