కొత్తగా 1,825 కరోనా పాజిటివ్ కేసులు

హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,825 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 351 మంది కోలుకున్నారు. ఒకరు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,995 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

తెలంగాణలో రికవరీ రేటు 97.26 శాతంగా ఉంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో గడిచిన 24 గంటల్లో 1,042, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 201, రంగారెడ్డిలో 147, సంగారెడ్డిలో 51, హనుమకొండలో 47, మంచిర్యాలలో 38, నిజామాబాద్ లో 26, ఖమ్మంలో 27, మహబూబాబాద్ , పెద్దపల్లిలో 25 కేసుల చొప్పున, మహబూబ్ నగర్ లో 22 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.