ఏపీ రాజధానిపై :సుప్రీంలో కేంద్రం అఫిడవిట్​ 

ఏపీ రాజధానిపై :సుప్రీంలో కేంద్రం అఫిడవిట్​

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎంపిక విషయాన్ని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంతో ముడిపెట్టింది. రాజధానిపై అధ్యయనం కోసం ఆ చట్టంలోని నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పంపిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోటిఫై చేసిందని వెల్లడించింది. ఆ తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏపీ సీఆర్​డీఏ బిల్లు రద్దు, మూడు రాజధానుల చట్టాలను తీసుకొచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది.