పోలవరం జెట్ స్పీడ్.. స్పిల్ వే , పియర్స్ 28 మీటర్స్ నుంచి 52 మీటర్లకు..

కమిషన్ల కక్కుర్తి తో పోలవరం ప్రాజెక్ట్ ను తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అటకెక్కించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు పూర్తిగా వ్యయాన్ని భరించి నిర్మించి ఇవ్వాల్సిన పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్ట్కు చంద్రబాబు మరణ శాసనం రాశారు. ఎవరికో పుట్టిన బిడ్డను తనది గా చెప్పుకోవటం అలవాటుగా మారిన చంద్రబాబు అది టి డి పీ లేదా పోలవరం ప్రాజెక్ట్ అయినా ఒకటే అని నిరూపించుకున్నారు. టి డి పీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్ట్ ను తామే నిర్మించుకుంటామని కేంద్రం పై వత్తిడి తెచ్చి బలవంతంగా లాక్కున్నారు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం ప్రకటించింది. వ్యయాన్ని భరిస్తామని ప్రకటించింది. అయితే ఇవేమి తనకు, తనకు కావాల్సిన వారికి లాభ తెచ్చి పెట్టవని భావించిన చంద్ర బాబు కేంద్రం పై వత్తిడి తెచ్చి రాష్ట్రమే నిర్మించేలా ఒప్పందం చేసుకున్నారు.

పోలవరం జెట్ స్పీడ్.. స్పిల్ వే , పియర్స్ 28 మీటర్స్ నుంచి 52 మీటర్లకు..

ఈ ప్రాజెక్టుకు అవసరమైన కీలకమైన అనుమతులను దివంగత వై ఎస్ రాజశేఖరెడ్డి తీసుకొచ్చారు. ఆయన తెచ్చిన అనుమతుల వల్లే ప్రస్తుతం ప్రాజెక్ట్ పరుగులు తీస్తోంది. కుడి, ఎడమ కాలువల్లో సింహ భాగాన్ని ఆయన పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సి ఎం గా ఉన్న సమయం లో ట్రాన్స్ట్రోయ్ కంపెనీ ప్రారంభించింది. అపుడు పనులు నెమ్మదిగా జరిగాయి. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పనులను నవయుగ కంపెనీకి అప్పగించారు. ఈ కంపెనీకి పనులు అప్పగించేందుకు చంద్రబాబు ప్రత్యేక విమానంలో నాగపూర్ వెళ్లి అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పై వత్తిడి తెచ్చి సాధించుకున్నారు. ఈ కంపెనీ తనకు బాగా కావాల్సిన వారిది కావటం వల్లే చంద్రబాబు అంత ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. ఈ కంపెనీకి చంద్రబాబు నామినేషన్ పద్దతిలో పనులు కట్టబెట్టారు. జాతీయ ప్రాజెక్ట్ కావటం తో ఈ ప్రాజెక్ట్ విషయం లో చంద్రబాబు వ్యవహరించిన తీరుకు సంబంధించిన పూర్తి వివరాలు కేంద్రం తో పాటు రాష్ట్రం వద్ద సిద్ధంగా ఉన్నాయ్. వీటిపై అటు కేంద్రం లేదా ఇటు రాష్ట్రం తగిన సమయంలో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయ్. పోలవరం ప్రాజెక్ట్ భూ సేకరణ సమయంలో చంద్రబాబు, ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టి డీ పీ నేతలు చేతివాటం ప్రదర్శించారు. కొందరు నేతలు, ముఖ్యంగా పార్టీకి చెందిన దళారులు కోట్లకు పడగలెత్తారు. ఈ అంశంపై పూర్తి సమాచారం ఉండటంతో వల్లే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజమండ్రి లో జరిగిన సభలో పోలవరం ప్రాజెక్ట్ తెలుగు దేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ టి ఎం గా మారిందని ఆరోపణ చేశారు. వై ఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన అనుమతులు, పూర్తి చేసిన కాలువ పనులు, కిరణ్ కుమార్ రెడ్డి హయాం లో జరిగిన స్పిల్ వే లోని కొంత భాగం పనులను కూడా తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవరం గా చేసి కష్టపడ్డానని ప్రచారం కోసం ఉపయోగించుకున్న విషయం అందరికి తెలిసిందే. తన హయాం లో పోలవరం ప్రాజెక్ట్ 69 శాతం పూరీతి అయిందని చంద్రబాబు అండ్ కో చెబుతోంది. అయితే గత ప్రభుత్వాలు చేసిన పనులు కూడా ఇందులో ఉన్నాయి. 2019లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత ప్రాజెక్ట్ లో పనుల వేగం పెరిగింది. వడివడిగా పనులు జరుగుతున్నాయి. ఇపుడు ప్రాజెక్ట్ ఒక రూపుకు వచ్చింది. ప్రతి సోమవారాన్ని పోలవరం గా చేసిన చంద్రబాబు 29 విడతలు ప్రాజెక్ట్ ప్రాంతాన్ని సందర్శించారు. సుమారు 90 విడతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జలవనరుల సఖ మంత్రి 70 విడతలు ప్రాజెక్ట్ ను సందర్శించారు. సమీక్షలు చేసారూ. అయినా పనులు ముందుకు సాగా లేదు. పనులు అంతగా సాగని ఈ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని చూపించేందుకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలను తరలించి చూపించింది. ఇక్కడ సాధారణంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఏదో అద్భుతం జరిగినట్టుగా చిత్రీకరించి వంధిమాగధులతో హడావిడి చేశారు చంద్రబాబు నాయుడు. కుటుంబ సభ్యులను కూడా ఇక్కడకు రప్పించి తనతో పాటు వారు కూడా రాష్ట్రానికి ఏదో మేలు చేస్తున్నారు నే కలర్ ఇచ్చి చివరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో తన హయాంలో ప్రచారం తప్ప పురోగతి లేదని చెప్పకనే పలుమార్లు చెప్పారు. అధికారం లో ఉన్నపుడు పోలవరం నిర్మాణం కొద్దిగా చేసి ఎక్కువ ప్రచారం పొందిన చంద్రబాబు ఇపుడు ఏంటో వేగంగా పనులు జరుగుతున్నా తన వక్ర బుద్దిని బైట పెడుతూ గంపెడు మట్టి తీయలేదు, తట్టెడు కాంక్రిట్ వేయలేదు అని అసత్య ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తన హయాం లో నత్త నడక నడుస్తుండటాన్ని ప్రశ్నించిన అప్పటి ప్రతి పక్షాన్ని చంద్రబాబు అండ్ కో అసెంబ్లీ సాక్షిగా ఎద్దేవా చేసింది. వై ఎస్ ఆర్ సి పీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ని నీ పత్రికలో రాసిపెట్టుకో 2018 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి సాగు నీటిని అందిస్తాం అని చెప్పారు. ఆ తరువాత సంవత్సరం పాటు అధికారం లోఉన్న చంద్రబాబు , దేవినేని ఉమ అసెంబ్లీ సాక్షిగా చేసిన సవాల్కు కట్టుబడలేక ఓడిపోయారు.

పోలవరం జెట్ స్పీడ్.. స్పిల్ వే , పియర్స్ 28 మీటర్స్ నుంచి 52 మీటర్లకు..

బాబు హయం లోనే… పోలవరం సాయంలో కోటకు నిర్ణయం…

చంద్రభాను కేంద్ర ప్రభుత్వం లో భాగస్వామిగా ఉన్నపుడే పోలవరం ప్రాజెక్టు వ్యయంలో కోత విధించాలని నిర్ణయించింది. ఐన చంద్రబాబు స్పందించలేదు. 2011 నుంచి ఈ ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతూ వస్తోంది. సవరించిన అంచనా ల ప్రకారం యెంత నిధులు కావాలో వెల్లడించాలని కేంద్రం కోరినా చంద్రబాబు ఉల్కలేదు, పలకలేదు. 2017లో కేంద్ర ప్రభుత్వం పోలవరం కు అందించే సాయాన్ని తగ్గిస్తూ తీర్మానం చేసింది. అపుడు అశోకగజపతి రాజు, సుజనా చౌదరి కేంద్రంలో మంత్రులుగా ఉన్న వ్యతిరేకించలేదు. ఇదే తీర్మానాన్ని చంద్రబాబు అసెంబ్లీ, కౌన్సిల్ లో చదివి వినిపించారు. అపుడు కొందరు సభ్యులు ప్రాజెక్ట్ వ్యయం 40 వేల కోట్లు అవుతుందని వార్తలు వస్తున్నాయి, ఆ మొత్తం కేంద్రం భరిస్తుందా అని ప్రశ్నిస్తే చంద్రబాబు నుంచి మౌనమే సమాధానము అయ్యింది. అంటే 2017లో పోలవరం ప్రాజెక్ట్ వ్యయం 20,398 కోతలు మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పింది. తాము ఎలాగూ ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేము, మళ్ళి ఎన్నికల్లో గెలవం, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వారు చూసుకుంటారులే అని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చి వాస్తవాలను మరుగున పరిచారనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతకు ముందు కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. దీన్ని చంద్రబాబు స్వాగతించారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రాన్ని అభినందించారు. అపుడే నీరి పారుదలకు అవసరమైన మొత్తం ఖర్చును భరిస్తామని చంద్రబాబు అంగీకరించారు. కేంద్రం పోలవరం విషయంలో తాజాగా నిధుల విడుదల విషయంలో జాప్యం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు పోలవరం విషయంలో రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలు వెలుగు చూస్తున్నాయని అంటున్నారు.

జగన్ హయాంలోనే పోలవరంలో అసలైన పనులు….

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తరువాతనే పోలవరం ప్రాజెక్ట్ లో అసలైన పని మొదలైంది.

తెలుగు దేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రచారం కోసం రికార్డుల సాధన పేరుతొ అడ్డదిడ్డంగా పని జరిగేది. చంద్రబాబు ఇంజనీర్ అవతారం ఎత్తి తాను చెప్పినట్టు ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి గ్యాలరీ వాక్, ప్రతి చిన్న విషయానికి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు పేరుతొ హడావిడి చేశారు. ప్రస్తుతం నీటి పారుదల సా ఖ అధికారుల పర్యవేక్షణలో వేగంగా అనుకున్న లక్ష్యం సాధన దిశగా పనులు జరుగుతున్నాయి.

పోలవరం జెట్ స్పీడ్.. స్పిల్ వే , పియర్స్ 28 మీటర్స్ నుంచి 52 మీటర్లకు..

వై ఎస్ జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే పోలవరం పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించి రివెర్స్ టెండరింగ్ నిర్వహించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ ఈ పనులను దక్కించుకుంది. గత ఏడాది నవంబర్ ఒకటో తేదీన భూమిపూజ నిర్వహించిన మేఘా సంస్థ అప్పటి నుంచి కరోనా విపత్కర పరిస్థితులు, భారీ వరదలు వగైరా అవాంతరాలు ఎదురైనా పనులను కొనసాగిస్తోంది. అనుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం లో ప్రధానమైంది గోదావరి నది దిశను స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్కు మరలించటం. ఈ పని పూర్తి చేయకుండా 70 శాతం పనులు ఎలా చేశామని చెప్పుకుంటున్నారో టి డీ పీ కె తెలియాలి. ఈ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. రేయింబవళ్లు పోలవరం పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

తెలుగు దేశం పార్టీ హయం లో స్పిల్ వే లో కీలకమైన పియర్స్ పనులు సగటున 28 మీటర్లు మాత్రమే జరిగాయి.. ఇక్కడ ఒక్కో పియర్ ఎత్తు 55 మీటర్లు.

జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం మేఘా సంస్థకు పోలవరం కాంట్రాక్టు పనులు అప్పగించిన తరువాత ప్రాజెక్ట్ స్పిల్ వే లోని 52 పియర్స్ ఎత్తు అవసరమైన 55 మీటర్లకు చేరుకుంది.

52వ పియర్ నుంచి స్పిల్ వే పైన బ్రిడ్జి నిర్మాణం ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ప్రభుత్వం వేగంగా పనులు జరుగుతున్నాయి అని చెప్పటం పరిపాటే. అయితే ఇక్కడ మాటల్లో కాదు చేతల్లో పనులు చేసి చూపిస్తోంది మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో. కిలో మీటర్ పైగా పొడవున్న ఈ బ్రిడ్జి పనులు ప్రస్తుతం పావు కిలోమీటర్ పూర్తి ఐంది.

బ్రిడ్జి నిర్మాణం చేయాలంటే స్పిల్ వె మీద గడ్డెర్లు ఏర్పాటు చేయాలి. మొత్తం 192 గడ్డెర్లు అవసరం కాగా వాటి నిర్మాణం పూర్తి చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. వీటిలో 84 గడ్డెర్లను స్పిల్ వే పై అమర్చింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. మిగిలిన బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన షటరింగ్ వగైరా పనులు ఇప్పుడు జరుగుతున్నాయి.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో సుమారు 20 లక్షల క్యూసెక్కుల భారీ వరద వచ్చింది ఈ ఏడాది. అపుడు కూడా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆగకుండా చర్యలు తీసుకోండి ప్రభుత్వంతో పాటు నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆగిపోయాయని అనే వారికి ఇది ఒక సమధానం.

స్పిల్ వే పై బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే స్పిల్ వే ఇక పూర్తి అయినట్లే. స్పిల్ వే లో ఇక మిగిలి ఉంది గేట్స్ బిగించే పని. గేట్స్ బిగించేందుకు అవసరమైన ట్రూ నియాన్ బీమ్ లను స్పిల్ ఛానల్ వైపు నిర్మించాలి. వీటి నిర్మాణం పూర్తి అయితేనే గేట్లు బిగించేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే పైన 25 ట్రూనియన్ భీమ్స్ నిర్మాణం పూర్తి ఐంది.

ట్రూ నియాన్ బీమ్స్ నిర్మాణం ఒక పక్క పూర్తి చేసుకుంటూనే మరో పక్క గేట్స్ ఏర్పాటుకు ప్రభుత్వం, మేఘా సంస్థ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే 48 గేట్స్ నిర్మాణం పూర్తి ఐంది. గేట్స్ ఏర్పాటుకు అవసరమైన ప్రాధమిక పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 2018 డిసెంబర్ 24న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం స్పిల్ వే లోని 40-41 పియర్స్ మధ్య వాటి ఎత్తు 28 మీటర్లు ఉండగానే రేడియల్ గేట్స్ బిగిస్తున్నామని హడావిడి చేశారు. ఆ రోజు ఒక ఇనుప రేకు ముక్కను అక్కడ నిలబెట్టి ఇదే గేట్ అని చూపించే ప్రయత్నం చేశారు. అయితే అసలైన గేట్ ఏర్పాటు చేసే పని ప్రస్తుతం ప్రారంభం కాబోతోంది.

దేశంలో కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో దాదాపు అన్ని ప్రోజెక్టుల పనులు నిలిచి పోయాయి. అయితే పోలవరం పనులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యధావిధిగా కొనసాగించింది. దీనిని బట్టే ఈ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం యెంత ప్రతిష్టాత్మకంగా తీసుకొందో అర్ధం అవుతుంది. స్పిల్ వే గేట్ల నిర్మాణం పూర్తి అయితే గోదావరి నీటిని మళ్లించి మిగిలిన నిర్మాణాలను చేపట్టేందుకు అవకాశం ఉంటుంది.

ఇప్పటి వరకు పోలవరం స్పిల్ వే మరియి స్పిల్ ఛానెల్ లో కలపి మేఘా ఇంజనీరింగ్ సంస్ద 3లక్షల 10వేల క్యూబిక్ మీటర్ల కాంక్రిట్ పనులు పూర్తి చేసింది. గ్యాప్-3 కు సంబందించిన మట్టి తవ్వకం ,కొండరాయి తొలిచే పనులు పూర్తి అయ్యాయి. కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి.

స్పిల్ ఛానెల్లో మట్టి తవ్వకం పని 10,64,417 క్యూబిక్ మీటర్లు పూర్తి అయింది. కాంక్రీట్ పని 1,10,033 క్యూబిక్ మీటర్లు పూర్తి అయింది. ప్రస్తుతం అక్కడ వరద నీరు నిలిచి ఉండటం వల్ల పనులు ఆగిపోయాయి. ఇక్కడ నిలిచిన నాలుగు టి ఎం సి ల నీటిని ఈనెల 15నుంచి పంపింగ్ చేయనున్నారు. ఆ తరువాత నిర్మాణ పనులు తిరిగి స్పిల్ ఛానల్ లో ప్రారంభం అవుతాయి. స్పిల్ ఛానల్ పనుల్లో గిన్నెస్ బుక్ రికార్డు సాధన కోసం గత ప్రభుత్వం కీలకమైన ప్రాంతంలో కాకుండా ఇబ్బంది లేని చోట మాత్రమే కాంక్రీట్ పని చేసింది. కీలకమైన ప్రాంతాల్లో పనిని మేఘా ఇంజనీరింగ్ పూర్తి చేస్తోంది. .ఈ రెండు పనులను ఈ సీజన్ లో పూర్తి చేయబోతుంది మేఘా ఇంజనీరింగ్ సంస్ద. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం తట్ట మట్టి కూడా ఎత్తని పవర్ హౌస్ ఎర్త్ వర్క్ మరియు కొండరాయి తొలగింపు పనులు మేఘా ఇంజనీరింగ్ చేపట్టిన తరువాత 609790 క్యూబిక్ మీటర్లు పూర్తి అయింది. 902 కొండ తవ్వకం పనులు 1,88,623 క్యూబిక్ మీటర్లు గ్యాప్-2 వైబ్రో కాంప్యాక్షన్ పనులు 10,85,625 క్యూబిక్ మీటర్ల పూర్తి చేయడం జరిగింది. 1,61,310 క్యూబిక్ మీటర్లు శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది.గ్యాప్ 1లో ఢయా ప్రం వాల్ నిర్మాణ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి.ఇప్పటికే 2ప్యానెల్స్ కాంక్రీట్ నిర్మాణం కూడా పూర్తి అయింది.