బీజేపీలోకి పొంగులేటి చేరిక దాదాపు ఖరారు..!

బీజేపీలోకి పొంగులేటి చేరిక దాదాపు ఖరారు..!

బీజేపీలోకి పొంగులేటి చేరిక దాదాపు ఖరారు..!

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ని వీడుతున్నారా, త్వరలోనే బీజేపీలోకి వెళ్తున్నారా .. ఇందుకోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారా అంటే అవుననే చెప్పాలి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ గూటికి పొంగులేటి చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. జనవరి 10న నియోజకవర్గ అనుచరులతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం పొంగులేటితో మంతనాలు జరిపినట్లు సమాచారం. దీంతో జనవరి 18న కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది.

కాగా ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రతను తెలంగాణ సర్కార్ తగ్గించింది. ప్రస్తుతం ఆయనకు ఇస్తున్న 3 ప్లస్ 3 భద్రతను 2ప్లస్ 2 కి తగ్గించింది. అంతేకాదు ఇప్పటివరకు ఆయనకు కొనసాగిస్తున్న ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించింది. ఉన్నట్టుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పొంగులేటి అమిత్ షా తో భేటీ.. పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నాయి.